సీక్రెట్ గా విశాల్ నిశ్చితార్థం.. ఆ భయం తోనేనా..!!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. హైదరాబాద్ అబ్బాయి అనిషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పెద్దలు అంగీకరింఛాయా ఈరోజు హైదరాబాద్ లో విశాల్, అనిషాల నిశ్చితార్ధం జరుగుతున్నట్టు సమాచారం. ఈ నిశ్చితార్ధం ఎక్కడ జరుగుతున్నది.. ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కారణాలు ఏంటి అనేది తెలియాలి. విశాల్ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ టెంపర్ రీమేక్ సినిమా అయోగ్యలో నటిస్తున్నారు. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’సినిమా సూపర్ హిట్ కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రవెల్ వరకు నెగిటీవ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఆ తర్వాత నేరస్తుల గుండెల్లో సింహస్వప్నంగా మారుతాడు. ఈ సినిమాకు కోర్టు సీన్ హైలెట్ గా నిలిచింది. బాలీవుడ్ లో ఈ సినిమా సింబా గా రిలీజ్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించాడు. ఇక కోలీవుడ్ లో విశాల్ ‘అయోగ్య’ సినిమాగా వస్తుండగా సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే సాంగ్ ని ‘అయోగ్య’లో ఐటమ్ సాంగ్ గా తీసుకున్నారు. ఇటీవల్ ఈ సాంగ్ షూటింగ్ లో విశాల్ కాలికి గాయం కావడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ముందుగా అనుకున్న సమయానికి షూటింగు పూర్తిచేయలేకపోతున్నందు వలన విడుదల తేదీని వాయిదా వేశారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..