మెగా ఫ్యామిలీ లో ప్రకంపనం.. అతనితో డేట్ చేస్తానని చెప్పేసిన నిహారిక..!!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతమంది హీరో లు వచ్చారో అందరికి తెలిసిందే.. దాదాపు డజనుమంది హీరోలు ఆ కుటుంబం నుంచి రాగ అందరు మంచి స్థాయిలో ఉన్నారు.. టాలెంట్ లేనిదే ఏహీరో ని ఎవరు ఆదరించరు మెగా ఫ్యామిలీనుంచి వచ్చిన హీరోలు తమకంటూ ఇమేజ్ ని సృష్టించుకుని సెపరేట్ ఆడియన్స్ ని ఏర్పరుచుకున్నారు.. దానికి తోడు మెగా ఇమేజ్ తోడవడంతో వారికి త్వరగా గెట్ ఇన్ అయ్యే అవకాశం కలిగింది.. ఇక ఈ ఫ్యామిలీ నుంచి హీరో లే కాకుండా హీరోయిన్స్ కూడా వచ్చి తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు.. అలా నిహారిక కొణిదెల మొదట యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తో తన సత్త చాటి ఒక మనసు సినిమా తో పూర్తి స్థాయి హీరోయిన్ గ మారింది. తొలి సినిమా తోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన నిహారిక ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం సూర్యకాంతం సినిమా తో బిజీ గా ఉన్న ఈ మెగా పాప సినిమా విశేషాలను పంచుకుంటూ ప్రమోషన్ లో పాల్గొంటుంది.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది..డేట్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అన్న ప్రశ్నకు తాను ఓపిగ్గా వినే వారిని మాత్రమే తాను ఎంచుకుంటానని ఎందుకంటే తానెక్కువగా మాట్లాడతాను కనుక అని నవ్వుతు సమాధానం ఇచ్చింది.. ఇక సూర్యకాంత సినిమా మార్చి 29 న విడుదల అవుతుండగా, రాహుల్ విజయ్ ఈ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు.. మార్క్ రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు..