RRR పట్ల సంతోషం వ్యక్తం చేసిన అలియా..!!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టులోకి అలియా భట్‌ను తీసుకుంటున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ప్రెస్ మీట్ జరుగడానికి కొన్ని రోజుల ముందే అలియా భట్ విషయం మీడియాకు లీకైంది.

ఆలియా తాజాగా ఓ ట్వీట్చేస్తూ ‘నేను చాలా చాలా గొప్పగా ఫీలవుతున్నా. స్టార్ హీరోలతో ఒక అందమైన ప్రయాణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. మీరు డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్యూ ఎస్ ఎస్ రాజమౌళి సర్’ అని ఆలియా ట్వీట్ చేసింది.

అలియా భట్ బాలీవుడ్లో వరుస విజయాలు అందుకోవడంతో పాటు తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంటుతో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌గా మారింది. పలు బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ‘రాజీ’ సినిమా విజయం తర్వాత ఆమె రెమ్యూనరేషన్ మరింత పెరిగిందట. ఈ చిత్రానికి రూ. 7.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.