సన్ అఫ్ సత్యమూర్తి తరహాలోనే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ ల టైటిల్..!!

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఎట్టకేలకు సెట్స్పైకి వెళ్లనుంది.. మధ్య లో ఎన్ని మనస్పర్ధలొచ్చినా ఫైనల్ గా సినిమా పట్టాలెక్కబోతుంది.. హీరోయిన్ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో ఆఖరికి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎన్ని మనస్పర్ధలొచ్చినా సినిమా నేడో రేపో సెట్స్ పైకి వెళ్తుందని విషయం అటు అభిమానులతో పాటు, ప్రేక్షకులకు ఊరటనిచ్చే విషయం.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమా ని సంయుక్తంగా నిర్మిస్తుండగా, పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా కి సంబంధించి ఓ అప్ డేట్ బన్నీ అభిమానులను ఖుషి చేస్తుంది.. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కి టైటిల్ గా ‘ నాన్న..నేను’ ని పరిశీలించబోతున్నారట.. కానీ సినిమా పై ఫాన్స్ కాస్త పెదవి విరుస్తున్నారు.. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో సన్ అఫ్ సత్యమూర్తి సినిమా రాగ అదే సెంటిమెంట్ తో ఈ సినిమా అవసరమా… అని అంటున్నారు.. ఇప్పటికే చేసేదేం లేదు కాబట్టి సినిమా అయినా చాల బాగుండాలి అని దెమంద్స్ పెడుతున్నారు.. వెరైటీ గా సినిమా లు తీయడం లో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు.. అయన సినిమా ల్లో హీరో మేజిక్ కన్నా అయన మేజిక్ ఎక్కువగా ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఈ సినిమా ని అభిమానులకు మెచ్చే విధంగా తీస్తారా లేదా అన్నది చూడాలి..