లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి మరో పాట విడుదల..!!

టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు కేంద్రంగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తున్నారు. ఓ వైపు ఏపిలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇప్పుడు తెలుగు దేశం నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అయితే ఈ సినిమా 22 న విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల 29 కి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా టీడీపీ శ్రేణులు కోర్టుకు ఎక్కారు..కానీ టీడీపి కోర్టు షాక్ ఇస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల రిలీజ్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక పోతే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం వర్మ ‘విజయం విజయం ఘన విజయం… విజయం విజయం శుభసమయం… జయహో నాదం.. ఎదలో మోదం.. వదనాల వెలిగే హాసం… గుండెల్లో లోలోపల ఆనందం…’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విడుదల చేశారు. 1989 తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించింది..ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, ఎన్టీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే క్రమంలో వస్తుందని తెలుస్తోంది. పాట పూర్తయిన తర్వాత ‘నీలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని నిందలు మోపారు. వాళ్లందరికీ ఈ ఘనవిజయం ఓ గొప్ప చెంపదెబ్బ’అన్న ఎన్టీఆర్ డైలాగ్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై తెలుగు రాష్ట్ర ప్రజల్లో భారీ అంచనాలు పెంచేశారు.