అంతా పూరి జగన్నాధ్ వల్లే.. నాగార్జున కూడా తోడయ్యి నన్నిలా చేశారు – అనుష్క..!!

సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ నాకు పెద్దగా లేదు.. నా అంతటా నేను ఇండస్ట్రీలోకి రాలేదు.. సూపర్ సినిమా ను తెరకెక్కిస్తున్న పూరీజగన్నాధ్ కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారని తెలిసింది. నేను వెళ్లి కలిశాను.. దాంతో సూపర్ సినిమాలో నటించే అవకాశం లభించింది.. అని అనుష్క అన్నారు.. అలా మంచి 13 న మొదలైన నా ప్రయాణం నేటికీ 14 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.. నాకోసం సమయం కేటాయించి మంచి కథలు రాశి నా జీవితాన్ని మార్చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. ముఖ్యంగా నాగార్జున, పూరి జగన్నాధ్ కి నా కుటుంబం, స్నేహితులకు అభిమానులకు రుణపడి ఉంటాను అని అనుష్క చెప్పింది.. ఇక బాహుబలి తర్వాత భాగమతి సినిమా తో సూపర్ హిట్ కొట్టిన అనుష్క పేష్టుహం సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తుంది.. హేమంత్ మధుకర్ దర్శకుడు.. మాటల రచయితగా కోనవెంకట్ వ్యవహరిస్తున్నారు.. ఈ చిత్రం ప్రధాన భాగం అమెరికాలో జరుగుతుంది.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.. ఇక ఆమె పెళ్లి గురించి ఇటీవలే వస్తున్న వార్తలను ఆమె చాల సార్లు ఖండించింది.. ప్రభాస్ తో త్వరలో పెళ్లి అని మీడియా లో వార్తలు హల్చల్ కాగా అనుష్క మాత్రం దానిపై పెద్ద గా స్పందించలేదు.. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని పలు సందర్భాల్లో పేర్కొంది.. ఇటీవలే మిర్చి సినిమా చైనా లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వారిద్దరూ కలిసి అక్కడికి వెళ్లడం వారి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది..