నటించడంలో హద్దు ఉండదు.. దేనికైనా నేను రెడీ..అది కూడా – అదితి రావ్ హైదరి..!!

మణిరత్నం సినిమా లు ఆడినా ఆడకపోయినా అయన సినిమా లోని నటీనటులకు మంచి పేరొస్తుంది.. అయన సినిమా అవకాశం వచ్చిందంటేనే నటులు ఆస్కార్ రేంజ్ నటులు అందులో ఉన్నట్లు లెక్క అని చాల సార్లు రుజువైంది.. డైరెక్షన్ పరంగా, సినిమా పరంగా అయన కెరీర్ లో చాలానే సక్సెస్ లు ఉన్నాయి.. ఇక ఆయన దర్శత్వంలో వచ్చిన చెలియా సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయినా సినిమా లో మంచి డెప్త్ ఉంది.. టేకింగ్ పరంగా సినిమా నుంచి చాల నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఆ సినిమా తో పరిచయమైనా హీరోయిన్ అదితి రావ్ హైదరి. అందం అభినయం కలిగి ఉన్న ఆ హీరోయిన్ కి ఇప్పుడు చేతిలో పలు ఆఫర్స్ తో ఫుల్ బిజీ గా ఉంది.. తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం సినిమా లతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తయారైన అదితి అటు కోలీవుడ్ లోనూ మంచి ఆఫర్స్ ని దక్కించుకుంటుంది.. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ సరసన సైకో సినిమా లో నటిస్తున్న ఈ భామ కి ధనుష్ నటిని ద్విభాషా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది.. కాగా తెలుగులో ఆమె కు ఇప్పుడు ఒక్క సినిమా లేదు.. అయితే అవకాశాల కోసం అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకత ఉండాలని అందాల ప్రదర్శన చేస్తూనే నీతి వ్యాఖ్యలు బోధిస్తుంది.. ఓ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటో రిలీజ్ చేసి సినిమాలో ఎంపిక లో కథే ముఖ్యం కానీ, తనకు భాష భేదాలు లేవని, చెప్పుకుంది అదితి.. సంతోషాలకు, బాధలకు మనుషులు ఒకేలా స్పందిస్తారు.. నేను ఎంచుకునే చిత్రాలకు హద్దు చూడను.. భాష , ప్రాంతం లాంటి తేడాలు నన్ను నటించకుండా అడ్డుకోవడం ఇష్టముండదు.. సినిమా కథలు మనిషి భావోద్వేగాలను చూపిస్తాయి.. ఈ అనుభూతులకు భాష భేదాలు ఉండవు. ఎక్కడైనా మంచి సినిమా ల్లో భాగమవ్వాలన్నదే నా కోరిక.. అని చెప్పింది..