ఎంతైనా చూపించడానికి రెడీ అంటున్న అదితి రావు హైదరి..!!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్లామర్ బాగా కావాలి. ముఖ్యంగా టాలీవుడ్ కి మసాలా అలా ఇలా ఉండకూడదు. అందుకే ఇక్కడకు ఎంతో మంది వచ్చి తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. చిత్రమేంటంటే ఎంత మంది వచ్చినా ఇంకా టాలీవుడ్ కి అందం కొరత అలాగే ఉంది. నిన్నటి అందాల కంటే నేటి సౌందర్యం పైనే ఇక్కడ మోజెక్కువ..

ఈ సిట్యుయేషన్ని ఫుల్ గా వాడేసుకోవాలనుకుంటోందిట ఈ అమ్మడు. ఆమె పేరే అదితీ రావ్ హైదరీ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. పద్మావత్ చిత్రంలో ఖిల్జీ మోహించిన అందాల రాకుమారి పాత్రలో మైమరిపించింది. అటుపై టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సుధీర్ బాబు సమ్మోహనంలో రియల్ లైఫ్ రోల్ పోషించి సమ్మోహనానికి గురి చేసింది. ఆ తరువాత మణి రత్నం కళ్ళలో పడి ఓ మూవీ చేసింది. అయినా సరైన బ్రేక్ రాలేదు

దాంతో సొగసులతో సెగ పుట్టించలాని ఈ హాటీ డిసైడ్ అయిపోయింది. కొన్నళ్ళ పాటు టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీని ఏలాలని నిర్ణయించుకున్న అదితి పరువాలకు పని చెప్పింది. పదునైన బాణాలను వేస్తోంది. తన గ్లామర్ ని తెగ చూపిస్తూ ఫోటోషూట్లను ఇన్ స్టాగ్రమ్ ట్విట్టర్ లో షేర్ చేస్తోంది. దాంతో యూత్ ఒక్క లెక్క లో వూగిపోతోంది. ఆ కాక ఇపుడు టాలీవుడ్ కి తాకిందంట. టాప్ హీరోల చూపు అదితి మీద పడిందని భోగట్టా. వరసగా బిగ్ ప్రొడక్షన్స్ నుంచే అదితికి కాల్స్ వస్తున్నాయట. అన్నీ కుది రితే అదిరే అదితి అందాలను ఎంచక్కా వెండి తెర మీద చూసేయొచ్చు. బీ రెడీ .