మహర్షి టీజర్ కి ముహూర్తం ఫిక్స్..!!

ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, సంఖ్యా పరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

దీనికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ రెండు పాటలను ఏప్రిల్ రెండో వారంలో షూట్ చేయబోతున్నారట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్ 25 న రిలీజ్ కావాల్సిన సినిమా మే 9 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ సినిమా టీజర్ ను ఉగాది రోజున రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.