భార్య ఉండగానే మరో హీరోయిన్ ని ఎలా పట్టుకున్నాడో చూడండి..!!

బాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు ఓ సింగర్ తో రిలేషన్ షిప్ లో ఉంటూ హాట్ టాపిక్ గా మారాడు. ఫర్హాన్ కి ఇప్పటికే పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ తన తోటి సింగర్ షిబాని దండేకర్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు ఫర్హాన్. ఇటీవల ఈ జంట మెక్సికోకు వెళ్లింది. అక్కడ బీచ్ ఒడ్డున వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ పిక్స్ లో షిబాని బికినీ వేసుకొని ఉండగా. ఫర్హాన్ వెనుక నుండి ఆమెను హత్తుకొని ఉన్నాడు. షిబానీ తీరుతో ఫర్హాన్ ఫ్యామిలీ కూడా ఆయనపై సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫర్హాన్ మొదటి భార్యతో కలిసి ఉంటూనే ఇలా మరొకరితో లవ్ ఎఫైర్ కొనసాగించడంతో బాలీవుడ్ మీడియాలో వీరిద్దరిపై పలు కథనాలు ప్రచురితమవుతున్నాయి. మరోవైపు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇంట్లో వయసొచ్చిన ఇద్దరు కూతుళ్లను పెట్టుకొని ఇవేం పనులంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.