ఆది పినిశెట్టితో హన్సిక రొమాన్స్… ఓ రేంజ్ లో చూపిస్తుందట..!!

అందాల ఆరబోత చేస్తేనే సినిమాల్లో అవకాశాలొచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు టాలీవుడ్ లో.. ఎక్కడో ఒక సినిమాలో తప్ప హీరోయిన్ కి మంచి పాత్రలు దక్కట్లేదు.. ఇదిలా ఉంటే దేశముదురు సినిమా తో టాలీవుడ్ కి పరిచయమై అనతి కాలంలో నే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ హన్సిక కి ఇప్పుడు తెలుగులో అంత మార్కెట్ లేదు.. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడికోసం క్యూలు కట్టారు. తనదయిన టైం లో గ్లామర్ షో లతో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ తాకిడి తో కనుమరుగైపోయింది.. తమిళ, కన్నడ పరిశ్రమల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న తెనాలి రామకృష్ణ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. తమిళ్లో 100 అనే టైటిల్ తో రూపొందుతున్న సినిమా లో, మరియు మహా సినిమా లో నటిస్తుంది..ఇది హన్సిక 50 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమా పెద్ద వివాదం అవ్వడం అందరికి తెలిసిందే. పోస్టర్స్ విషయం లో ఆ మధ్య ఫుల్ కాంట్రవర్సీ అవడంతో సినిమా పై మంచి హైప్ పెరిగింది.. ఇదిలా ఉంటే హన్సిక కి ఇప్పుడు మరో సినిమా లో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.. ఓ వైపు విలన్ గా హీరోగా దూసుకుపోతున్న ఆది పినిశెట్టి హీరో గా ఓ సినిమా తెరకెక్కుతుంది.. పార్ట్ నర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కి మనోజ్ దామోదరన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా అయినా హన్సిక కు తెలుగులో మరిన్ని అవకాశాలు తెప్పిస్తాయి అనేది చూడాలి.. తెలుగులో ఆఫర్స్ రావాలంటే తన చేతిలో ఉన్న ఒకే ఒక అస్త్రం గ్లామర్ షో.. ఈ సినిమాలో ఆ అస్త్రాన్ని ఉపయోగించి తెలుగులో మరిన్ని అవకాశాలు రాబట్టుకోవాలని చూస్తుంది..