హెల్మెట్‌ లేకుండా బండి తీస్తే బాదుడే

హెల్మెట్‌ లేకుండా బండి తీస్తే బాదుడే
నేటినుంచి నూతన వాహనచట్టం అమలు
సిద్ధమైన రవాణాశాఖ
వాహనదారులూ పారాహుషార్‌… ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడు ‘మీ రోజువారి కార్యకలపాలకు అవసరమైన వస్తువులతో పాటు మీ వాహనానికి సంబంధించిన పత్రాలను మరువకండి. ద్విచక్రవాహనదారులు ముఖ్యంగా హెల్మెట్‌. లేనిపక్షంలో భారీగా చెల్లించు కోవాల్సి వస్తుంది… అదేనండి అపరాధ రుసుం. ఇది ఈ నెల 1వతేదీ నుంచే అమల్లోకి వచ్చింది.
గుంటూరు : కేంద్ర ప్రభుత్వం జూలై 31న పార్లమెంట్‌లో అమో దించిన మోటారు వాహనాల సవరణ చట్టం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమ లులోకి వచ్చింది. మొత్తం 28అంశాలను పొందుపరిచిన ఈ బిల్లులో నింబంధనలు పాటించని వాహనాలపై భారీ జరిమానాల తో పాటు, ప్రయాణికుల సౌలభ్యం, సుర క్షిత రవాణాయే గాక ఆన్‌లైన్‌లో వాహ నాల రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ వంటి విష యాలను పొందుపరిచింది. ముఖ్య ంగా నిబంధనలు పాటించని వాహ నాల విషయంలో భారీ జరిమానా వడ్డిస్తుంది. జరిమానా రూ.1000 నుంచి ఆయా తప్పులను బట్టి రూ. 10,000 వరకు విధించాలని నిర్ణయిం చింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు గెజిట్‌ నోటి ఫికేషన్‌ విడుదల చేసింది. మిగతా అంశా లను అభిప్రాయ సేకరణ తరువాత అమలు చేస్తామని తొలుత ప్రమాదాలని వారణకు సంబంధించిన నిబంధనలను అమలు చే యాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికమే
రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మిగ తా జిల్లాలకంటే గుంటూరు జిల్లాలోనే అధి కమని గత సంవత్సరం రవాణాశాఖ ప్రకటించింది. హెల్మెట్‌, సీటుబెల్టు ధరించ కుండా వాహనాలను నడపడంతోపాటు రోడ్డుభద్రతపై అవగాహన కార్యక్రమాలు తక్కువగా నిర్వహించడం మరో కారణంగా తెలిపింది. జిల్లాలోని మొత్తం వాహనాలలో దాదాపు 78శాతం ద్వి చక్ర వాహనాలు ఉం డటం, జరిగిన ప్రమా దాలలో 60 శాతం వ రకు హెల్మెట్‌ లేకుం డా ప్రయాణించడం వల్లేనని పేర్కొంది. జి ల్లాలో మొత్తం 8లక్షల వా హనాలువుండగా వాటిలో 5,80,000 ద్విచక్ర వాహనాలే ఉన్నాయని గ ణాంకాలు తెలుపుతున్నాయి. మిగతా వాటిలో అధికంగా 69వేల కార్లు, 50వేల ఆటోలు, 47వేల వరకు సరుకు రవాణా చేసే వా హనాలు ఉన్నాయి. వీటిని నియత్రించ కలిగి నిబంధనలు పాటించే విధంగా చేయగలిగితే ప్రమాదాలను అరికట్ట వచ్చని జిల్లా అధికారులు భావి స్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ సగటున 6నుంచి 8 ప్రమాదాలు జరుగుతున్నా యని వీటిలో ఎక్కువగా హెల్మెట్‌, సీటు బెల్టు ధరించ కుండా ఉండటం, మద్యం తాగి వాహనాలు నడపటం వల్లేనని రవాణాశాఖ అధికారులు తెలుపుతున్నారు.

కేంద్రం మోటారువాహనాల సవరణ చట్టంలో అనేక అంశాలను చేర్చింది. వాటిలో ముఖ్యమైన అంశాలు…
ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్ప డు 4ఏళ్ల పిల్లలకు కూడా హెల్మెట్‌ తప్పనిసరి.
ద్విచక్రవాహనంపై ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్‌ తప్పక ధరించాలి.
అంబులెన్స్‌ లాంటి అత్యవసర వాహ నాలకు దారి ఇవ్వకపోతే రూ. 10వేల వరకు జరిమానా.
అధికలోడుతో సరుకును చేరవేసేవాహ నాలకు రూ.20వేల వరకు జరిమానా తోపాటు,అదనపు లోడును అక్కడిక్కడే దింపివేయుట.
అదనపు ప్రయాణికులను ఎక్కించి తీసుకువెళ్ళే వాహనాలకు ఇకపై భారీ జరిమానాలు తప్పవు. ఎంతమందిని అదనంగా ఎక్కిస్తే ఒక్కొక్కరికి రూ.200 నుంచి 1000వరకు జరిమానాతోపాటు అదనపు ప్రయాణికులను గమ్యం చేర్చే బాధ్యత కూడా సంబంధిత డ్రైవరుకే అప్పగింత.
మద్యం తాగి వాహనం నడిపితే 6 నెలల వరకు జైలుశిక్ష.
మైనర్లు వాహనాలను నడిపితే వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తేదా సం బంధిత వాహన యజమానులపై కేసుల నమోదు.
వాహన ప్రమాద బీమా ఏర్పాటు.
వాహన ప్రమాదాల్లో గాయపడిన వారి కి ప్రమాద బీమా నుంచి పరిహారం చెల్లింపు.
భారీగా జరిమానాలు…

నూతనంగా జారీచేసిన మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం జరిమానాల వివరాలు భారీగా వున్నా యి. ద్విచక్రవాహనదారులకు హెల్మె ట్‌ లేకుంటే రూ.వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తారు. వరుసగా మూడుసార్లు పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్సును పూర్తిగా రద్దు చేస్తారు. పరిమితికి మించి ప్రయాణిస్తే రూ.2000, మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించక పోతే రూ.2వేలు, సీ బుక్‌ లేకపోతే రూ.5వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే రూ.5వేలు, అర్హత లేకుండా వాహనం నడిపితే రూ.10వేలు, ప్రమాదకరంగా నడిపితే రూ.5వేలు, మితిమీరిన వేగంతో నడిపితే రూ. వెయ్యి నుంచి రెండు వేలు, రేసుల్లో పాల్గొంటే రూ.5వేలు, సీటు బెల్టు ధరించకుంటే రూ. వెయ్యి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినట్ల యితే… ఒక్కో ప్రయాణికుడికి రూ.200 నుంచి 1000 వరకు, పరిమితికి మించి సరుకు రవాణా చేస్తే ఒక్కో టన్నుకు రూ.2వేల నుంచి రూ.20 వేలు, అత్యవసర వాహనాలకు దారి వ్వకపోతే రూ.10వేలు, ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేలు, మైనర్లకు వాహనాలు యిస్తే రూ.25వేల జరిమానా, వాహన లైసెన్స్‌ రద్దు, తల్లిదండ్రులకు జైలుశిక్ష, నకిలీ పత్రాలతో వాహనాన్ని నడిపితే.. లైసెన్స్‌ రద్దు , సెక్షన్‌ 183, 184, 185, 189, 190, 194సి, 194డి, 194ఈ లకింద కేసు నమోదు. ఇవన్నీ మనకెందుకులే అనుకుంటే కచ్ఛితం గా నిబంధనలు పాటించాల్సిందే. లేకుంటే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సిందే.

నిబంధనలు కచ్ఛితంగా అమలుచేస్తాం
రహదారి భద్రత, సురక్షిత ప్రయాణంపై ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వ హించినా వాహనదారుల ప్రవర్తనలోమార్పు కనబడటం లేదు. జిల్లాలో జరిగే రోడ్డుప్రమా దాల వల్ల ప్రాణ నష్టంతోపాటు, ఆస్తినష్టం కూడా ఎక్కువగానే ఉంటోంది. మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. నేటి నుంచి నిబంధనలు పాటించని వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. జరిమానాల విష యంలో కేంద్రప్రభుత్వం ఆదేశాలప్రకారం నడుచుకుంటాం. ముఖ్యంగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వంటివి తప్పనిసరి. నాణ్యత ప్రమాణా లు లేని హెల్మెట్‌లు అమ్మినట్లయితే అమ్మ కందారులపైనా చర్యలు తప్పవు. వాహన దారులు కూడా ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనసరి గా పాటించాలి. ఒక్క హెల్మెట్టే కాదు వాహ నానికి సంబంధించి న ప్రతి పత్రం తప్పని సరిగా వాహన దారుల వద్ద ఉండాలి.