లక్ష్మీస్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అదేనా..!!

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ముహూర్తాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు వర్మ.ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాలో కేవలం నాదెండ్ల ఎపిసోడ్ ను మాత్రమే చూపించారు. ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ఆ సినిమా ముగుస్తుంది. సరిగ్గా ఆ సినిమా ఎక్కడ ముగిసిందో, అక్కడ్నుంచే లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలుకాబోతోంది.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఘటనలు, ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం, సొంత కుటుంబంలోనే కన్న కొడుకులు ఎన్టీఆర్ ను నీచంగా చూసిన పర్వం అన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఉండబోతున్నాయి. ఈ సినిమా ప్రారంభం నుంచి వార్తల్లో ఉంటూ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్టీఆర్ బయోపిక్ లో మూడో సినిమా ఇది. ఇదిలా ఉంటె, ఈ సినిమా తరువాత వర్మ చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది.

రీసెంట్ గా వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పారు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ కెసిఆర్ జీవితంపై సినిమా చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే కెసిఆర్ రాజకీయ జీవితంలో జరిగిన కీలక విషయాల గురించి పరిశోధన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ ఇస్తానని అంటున్నాడు వర్మ. కెసిఆర్ ను వర్మ ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ అప్పుడే మొదలైంది.