జయప్రకాష్ రెడ్డి గారు ఇకలేరు

విల‌క్ష‌ణ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి(74) ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం రాత్రి శ్వాస అంద‌క ఆసుప‌త్రికి వెళ్లారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం స‌డెన్‌గా గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి ఎన్నో ల‌క్ష‌ల మంది అభిమానుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది.

జయప్రకాష్ రెడ్డి గారు మరణంతో తెలుగు సినిమా, థియేటర్ మూగ‌బోయింది. ఆయ‌న చేసిన బహుముఖ ప్ర‌ద‌ర్శ‌న‌లు, మ‌ర‌పురాని సినిమాలతో ఎన్నో ద‌శాబ్దాలుగా అల‌రించారు. ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నాను. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి టాలీవుడ్ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సంతాపం తెలియ‌జేశారు.
జయప్రకాష్ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లోనూ ఆయన నటించారు.

 

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి