ఈర్ష్య తోనే సమంత సినిమా చూడలేదు – జెర్సీ హీరోయిన్..!!

నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు కథానాయక పరిచయమవుతోంది కన్నడ కస్తూరి శ్రద్ధా శ్రీనాథ్. నిజానికి, ఈ అమ్మాయి సంతకం చేసిన మూడో తెలుగు సినిమా ‘జెర్సీ’. మొదట 2017లో ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించాలనుకున్న సినిమాకు సంతకం చేసింది. ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కుతుందా? లేదా? అనేది డౌట్. తరువాత ఆది సాయికుమార్ ‘జోడి’కి సంతకం చేసింది. అయితే… ‘జెర్సీ’ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్, తెలుగు ‘యూ టర్న్’ పూర్తిగా చూడలేదని చెప్పింది. రచన పాత్రలో సమంతను అరగంట చూశాక ఈర్ష్య కలిగిందని… మిగతా సినిమా చూడలేకపోయానని ఆమె తెలిపింది. సమంత ని చూస్తే శ్రద్ధా శ్రీనాథ్ కి ఎందుకు ఈర్ష అనుకుంటున్నారా? కన్నడ ‘యూ టర్న్’లో రచన పాత్రలో ఆమె నటించింది ఒరిజినల్ హీరోయిన్ ఆమె అన్నమాట.

“రచన పాత్ర నాది కదా అందులో సమంతని చూడలేకపోయా అసూయ కలిగింది” అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ “తొలి తెలుగు సినిమాలో తల్లి గా కనిపించడానికి కాస్త ఆలోచించా. అయితే… మంచి కథ వచ్చినప్పుడు భవిష్యత్ గురించి ఆందోళనపడి వదులుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. సినిమాకు ఓకే చెప్పేశా. ఈ సినిమాలో కాసేపు గ్లామర్ గర్ల్ గానూ కనిపిస్తా” అని చెప్పింది.