లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కష్టమే.. కేసు పెట్టిన టీడీపీ..!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కి దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో ఆసక్తి ఎక్కువయిపోతుంది.. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు సినిమా లు ఇప్పటికే ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోగా ఇప్పుడు అందరి చూపులు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పడ్డాయి.. ఇందులో నిజముంటుంది అంటూ అన్ని పార్టీ ల నేతలు ఇప్పటికే సినిమా కి సపోర్ట్ ఇస్తుండగా, రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమా గురించి రోజుకో విశేషం పోస్ట్ చేస్తూ అందరి ద్రుష్టి ఈ సినిమా పై ఉండేలా చూసుకుంటున్నాడు.. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలను వర్మ ఈ సినిమా లో తెరకెక్కిస్తుండగా, ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కి ప్రేక్షకులనుంచి మాములు రెస్పాన్స్ రాలేదు.. సినిమా నిజంగానే హిట్ అయ్యేలా కనిపిస్తుంది.. ఇకపోతే ఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ను బాలయ్య కు అంకితమిస్తున్నట్లు వర్మ బాలయ్య ను ఉద్దేశించి ఇటీవలే వ్యాఖ్యలు చేశాడు వర్మ.. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అడ్డుకోవాలంటే అది నన్ను చంపితే కానీ జరగదు అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా.. ఇదిలా ఉంటె ఈ సినిమా రిలీజ్ కి చాల అడ్డంకులు ఏర్పడేలా ఉన్నాయి.. టీడీపీ శ్రేణులు ఈ సినిమా ని అడ్డుకునేందుకు చాల ప్లన్స్ వేస్తుంది.. ఇప్పటికే ఈ సినిమాపై పలు ప్రదేశాల్లో కేసులు నమోదు చేయగా ఓ వైపు వర్మ ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేయనీయకుంటే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడంతో టీడీపీ , వర్మ ల మధ్య రగడ ఎంతదూరం వెళ్తుందో అర్థంకావట్లేదు.. ఇక ఈ సినిమా పై అన్ని పార్టీ ల షేరేణులు ఆసక్తి గ ఎదురు చూస్తుండగా టీడీపీ కి మాత్రం దెబ్బమీద దెబ్బ పడ్డట్లయింది..