హాస్పిటల్ లో ఆ హీరో హీరోయిన్.. పెళ్ళికి ముందే గర్భం..!!

నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. త్వరలో మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలైకా గురించి మరో సంచలన వార్త ప్రచారం జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా మలైకా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారాలు సాగిస్తోంది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా లవ్ ఎఫైర్ బాలీవుడ్ అంతటా చర్చనీయాంశంగా మారింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని మలైకా వివాహం చేసుకుంది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విభేదాలతో మలైకా అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. మలైకా కన్నా అర్జున్ కపూర్ వయసులో దాదాపు 12 ఏళ్ళు చిన్న వాడు. మలైకా వయసు 45 ఏళ్ళు. తమ గురించి ఎవరేమనుకున్నా ఈ జంట మాత్రం పబ్లిక్ గా తిరుగుతూ ప్రేమలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ మాల్దీవులకు టూర్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి వివాహం గురించి చర్చ జరుగుతోంది. మలైకా, అర్జున్ కపూర్ ఇక వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయినట్లు వారి సన్నిహితులు చెప్పుకొచ్చారు.

మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. ఇటీవల మలైకా, అర్జున్ కపూర్ జంట ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కనిపించారు. వైరల్ భయాని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మలైకా, అర్జున్ కపూర్ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు. దీనితో నెటిజన్లలో ఊహాగానాలు పెరిగిపోయాయి. మలైకా అరోరా గర్భవతి అయ్యిందా అటూ చర్చ జరుగుతోంది. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ అర్జున్ కపూర్, మలైకా మీడియాకు చిక్కకుండా వేగంగా వెళ్లిపోయారు. వీరిద్దరూ ఎంఆర్ఐ, సీటి స్కాన్ విభాగాల భవనం నుంచి బయటకు రావడంతో చర్చ మరింతగా జరుగుతోంది. అర్జున్ కపూర్, మలైకా చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో మలైకా గర్భవతి అయిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.