రవితేజ సినిమా కి ఇంట్రస్టింగ్ టైటిల్..!!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరో గా ఎదిగిన నటుడు రవితేజ.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తో పూర్తి స్థాయి హీరో గా సక్సెస్ అయిన రవితేజ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఆయనకు తోడు పూరి జగన్నాధ్ తోడవడం ఇద్దరు వరుస హిట్స్ కొడుతుండడంతో తక్కువ కాలంలో ఇద్దరు స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.. స్టార్స్ అయ్యాక కూడా వీరు చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. అయితే మొదట్లో వరుస హిట్స్ కొట్టిన రవితేజ ఇప్పుడు కాస్త డల్ అయ్యాడు.. కాస్త బ్రేక్ తీసుకుని రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ సినిమా తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినా ఆతర్వాత వరుస ఫ్లాప్ లు ఆయన్ని మళ్ళీ వెనక్కి నెట్టేశాయి.. దాంతో ఈ సారి డిస్కో రాజా గా ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ని తప్పకుండా హిట్ చేయాలనే ఉద్దేశ్యంలో రవితేజ ఉండగా , అయన తాజాగా ఓ తమిళ రీమేక్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలకు ఊతమిస్తూ ఆ సినిమా టైటిల్ కూడా బయటకి వచ్చింది.. తమిలో వచ్చిన విజయ్ నటించిన తేరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక తెలుగు లో ఆ సినిమా భారీగా డిమాండ్ ఏర్పడగా, ఆ సినిమా ని పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిద్దామనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ గా ఉండడంతో ఆ సినిమా ని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు రవితేజ తో చేద్దామనుకోగా ఆ సినిమా కి కనకదుర్గ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట.. అభిమానులు ఈ టైటిల్ కచ్చితంగా రవితేజ కి సరిపోతుంద్దని, టైటిల్ లో మంచి మాస్ అప్పీల్ ఉంది.. అంటూ చెప్తున్నారు.. ఎన్టీఆర్ రభస లాంటి ఫ్లాప్ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈమేరకు ప్రేక్షకులకు నచ్చుతుందో చూద్దాం..