సినిమాలు రావాలంటే ఆ విషయం లో సర్దుకుపోవాల్సిందే..!!

మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అవసరమైనప్పుడు ఈ మిల్కీ బ్యూటీ అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడదు. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం సినిమాలు తెరకెక్కించే విషయంలో దర్శకుల ఆలోచన మారుతూ వస్తోంది. హీరోయిన్ల కోసం కూడా దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. దీనితో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు పెరుగుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు రాణిస్తున్నాయి. దీని ద్వారా తమకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉండే పాత్రలు వస్తున్నాయని అంటున్నారు.

కమర్షియల్ చిత్రాల విషయానికి వస్తే హీరోయిన్లకు పెద్దగా ప్రాధానత్య ఉండదు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడింది. హీరోయిన్ల పాత్రల విషయంలో చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. కేవలం హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తమని గ్లామర్ కోసం మాత్రమే వాడుకుంటున్నారని గతంలో చాలా మంది హీరోయిన్లు వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమన్నా అంటోంది.

హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలనేది డిసైడ్ చేసేది కథ. ప్రతి సారి హీరోలతో పోటీ పడే కథలు రావాలంటే కుదరదు. కమర్షియల్ చిత్రాలు కొన్ని నియమాలకు లోబడి చిత్రీకరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే దర్శకుడు హీరోయిన్ పాత్రని డిజైన్ చేస్తారు. హీరోయిన్ అన్నా కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటన్నింటికి సర్దుకుపోయి రాణించాల్సి ఉంటుంది అని తమన్నా పేర్కొంది.

ఓ హిట్ చిత్రం తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో దర్శకుడు చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు. దర్శకులు తీర్చిదిద్దిన కథ ప్రకారం నటించడమే హీరోయిన్ల పని. నటిగా గుర్తింపు కావాలా.. సినిమా విజయవంతం కావాలా అని అడిగితే తాను రెండవదే ఎంచుకుంటానని తమన్నా తెలిపింది. తమన్నా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, దట్ ఈజ్ మహాలక్ష్మి లాంటి చిత్రాల్లో నటిస్తోంది.