RRR లో హీరోయిన్ గా ఆ లేత హీరోయిన్..!!

ఎన్టీఆర్ ..రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. DVV దానయ్య సినిమా ని నిర్మిస్తున్నారు.. కథానాయికగా అలియాభట్ పేరుని రాజమౌళి అనౌన్స్ చేయగా మరో హీరోయిన్ పాత్రను త్వరలో వెల్లడిస్తారు…ఇక ఈ సినిమా లో ఒక ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ కనిపిస్తున్నారు.. . 2020 జులై లో సినిమా ని ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. కాగా ఈ రోజు నిర్వహించిన RRR ప్రెస్ మీట్ లో చిత్ర బృందం మాట్లాడి చిత్ర విశేషాలను పంచుకుంది.. భారీ బడ్జెట్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో రాబోతున్న సినిమా RRR.. రాజమౌళి తో సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని నిర్మాత DVV దానయ్య అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాటాడుతూ ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి తెలియని కోణాన్ని ఈ సినిమా లో ఆవిష్కరిస్తున్నారు , ఈ చిత్రం నాకు చరణ్ కి నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది ఇప్పటివరకు చేసిన 28 సినిమాకలంటే ఈ చిత్రానికి చేసిన హార్డ్ వర్క్ అంతకంటే పెద్దది , రాజమౌళి గారినుంచి మరో అద్భుతమైన చిత్రంగా ఈ చిత్రం అందరి ప్రశంశలు అందుకుంటుంది అన్నారు..
ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో సినిమాలకంటే ఈ సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా రామ్ చరణ్ స్పీచ్ లో తెలిపారు. ఇక దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. అజయ్ దేవగన్ గారు , అలియా భట్, సముద్ర ఖని ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది ఈ సినిమా టైటిల్ గా ‘ RRR ‘.. కానీ టాగ్ లైన్ మాత్రం ఒక్కో భాషలో ఒక్కోటి ఉంటుంది.. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా జూ.ఎన్టీఆర్ నటిస్తున్నారు.. వాళ్ళని ఈ పాత్రలకు ఎంచుకున్నందుకు చాల సంతోషంగా ఉంది అన్నారు..