ఇంస్టాగ్రామ్ లో పాయల్ రచ్చ..రచ్చ..కత్తిలాంటి ఫోటో భయ్యా..!!

ఆరెక్స్ 100 అనే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్ పుత్. కార్తికేయతో పాటుగా పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాలో చేసిన రొమాన్స్ అబ్బో అదరగొట్టేసింది అని చెప్పొచ్చు. ఆ సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అందం అభినయం రెండు కలగలిపిన పాయల్ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది.

ఇప్పటికే వెంకీమామా, ఆర్డిఎక్స్ సినిమాల్లో నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ సినిమాలతో పాటుగా తన ఫోటో షూట్స్ తో కూడా కుర్రళ్లను గిలిగింతలు పెడుతుంది. ఇన్ స్టాగ్రాం లో అమ్మడి పిక్స్ కు ఓ రేంజ్ లో ఫీలోవర్స్ ఏర్పడ్డారు. తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని కాపాడుకునేందుకు పాయల్ కూడా హాట్ పిక్స్ తో రెచ్చిపోతుంది. హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ఐటమ్ గర్ల్‌గా కూడా పాయల్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘సీత’ సినిమాలో పాయల్ చేసిన ఐటెమ్ సాంగ్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో అమ్మడి అందాలకు ఆడియెన్స్ హంగమా చేస్తున్నారు. ప్రోమోకే ఈ రేంజ్ రెస్పాస్ వస్తే సినిమాలో పాయల్ పాటకి సీట్లలో కూర్చోవడం కష్టమే అని చెప్పొచ్చు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ పాయల్ చేస్తున్న ఈ అటెంప్ట్స్ ఆమెకు తెలుగులో రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోయేలా చేస్తుంది.

లేటెస్ట్ గా షీన్ అనే వెస్ట్రన్ బ్రాండ్ కు ప్రమోట్ చేస్తూ ఇన్ స్టాలో పాయల్ పెట్టిన పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఓ పక్క వరుస అవకాశాలను అందుకుంటున్నా తన ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు పాయల్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.