Home Trending పెరుగు ప‌చ్చ‌డి ఆంటీకి పెరుగుతున్న ఫాలోయింగ్

పెరుగు ప‌చ్చ‌డి ఆంటీకి పెరుగుతున్న ఫాలోయింగ్

by WGDSWpkjnH

అవ‌కాశం వ‌స్తేనో..ఇస్తేనో త‌మ టాలెంట్ తో స‌త్తా చూపిస్తామ‌నే వాళ్లు చాలా మంది వుంటారు..అవ‌కాశాలు సృష్టించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకునే వాళ్లు చాలా త‌క్కువ‌గా వుంటారు. అందులో ఒక‌రు టిక్ టాక్ కుకింగ్ స్టార్ … పాజిటివ్ మైండెడ్ వుమెన్‌…పెరుగు చ‌ట్నీ ఆంటీ. త‌న మైన‌స్ ను కూడా ప్ల‌స్ చేసుకుని పాజిటివ్ మైండ్ సెట్ తో దూసుకుపోతున్న మోడ్ర‌న్ మ‌మ్మీ..క‌మ్మ‌ని వంట చేస్తూ చ‌క్క‌గా మాట‌లు చెప్పే …పెరుగు చ‌ట్నీ ఆంటీ సామాన్య మహిళ క‌నిపించే అసాధార‌ణ మ‌హిళ‌.

టిక్ టాక్ లో కుకింగ్ వీడియోస్ తో ఫేమ‌స్ అయిన పెరుగు ప‌చ్చ‌డీ ఆంటీ …టిక్ టాక్ బ్యాన్ తో చిన్న గ్యాప్ ఆమెకు వ‌చ్చింది. కానీ ఆ గ్యాప్ తీసుకోలేదు. త‌న ఫాలోవ‌ర్స్ ని డిస్పాయింట్ చేయ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో త‌న‌కు తెలియ‌క పోయినా…కూతుళ్ల స‌హాయంతో యూ ట్యూబ్ కి షిఫ్ట్ అయ్యారు. టిక్ టాక్ లో చెర్రీ శ‌తాక్షి యూజ‌ర్ ఐడి తో ఫేమ‌స్ అయిన పెరుగు ప‌చ్చ‌డి ఆంటీ…చెర్రీ శ‌తాక్షి పేరుతోనే యూ ట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లోనే దాదాపు ల‌క్ష మంది వ్యూవ‌ర్స్ చెర్రీ శ‌తాక్షి ఛానెల్ ను స‌బ్ స్కైబ‌ర్స్ చేసుకున్నారు. ఇంత‌లా పాలోయింగ్ పెంచుకున్న పెరుగుప‌చ్చ‌డి ఆంటీ ఎవ్వ‌రు.? ఆమె ఏమి చ‌దువుకున్నారు.? ఒక గృహిణిగా ఇద్ద‌రి పిల్ల‌ల‌తోటి వీడియోస్ ఏలా చేయ‌గలుతుంది? టెక్నిక‌ల్ గా ఎవ్వ‌రు స‌పోర్ట్ చేస్తున్నారు? ఈ ప్ర‌శ్న‌ల్ని ఒక ఎత్తు అయితే…పాలోయివ‌ర్స్ మ‌దిని తొలిచేస్తున్న మ‌రో ప్ర‌శ్న‌… పెరుగు చ‌ట్నీ ఆంటీ అస‌లు పేరు ఏంటి?

త‌న పాలోయివ‌ర్స్ మ‌న‌సు గ్ర‌హించిన ఆంటీ….రీసెంట్ ఒక యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు..ఆ ఇంట‌ర్య్వూలో ఆంటీ త‌న గురించి బోలేడు సంగుతులు వ్యూవ‌ర్స్ తో షేర్ చేసుకున్నారు… సుప్రియంక గారు.. అదే పెరుగు ప‌చ్చ‌డి ఆంటీ

 

 

You may also like