ఈసారి అతను కనిపిస్తే .. హోటల్లో ఎంత నరకం చూపించాడో – చిన్మయి..!!

ఈ మద్య సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి ఓ సంచలనం సృష్టించింది. ఇక మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు సంచలనాలు రేపితే..దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అయితే ఇలాంటి ఉద్యమాలు తీసుకు వచ్చిన వారిపై వత్తళ్లు కూడా బాగానే పెరిగిపోయాయి. తెలుగు లో శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ వల్ల ఆమె ఇప్పుడు తెర చాటున ఉండాల్సిన పరిస్థితి..ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఇక సింగర్ చిన్మయి పై కూడా రక రకాలుగా ఎటాక్ లు జరిగినట్లు పలు సందర్భాల్లో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈసారి తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తన కంటపడితే చెంప చెళ్లుమనిపిస్తానని ప్రముఖ గాయని చిన్మయి అన్నారు. పదేళ్ల క్రితం తనను వైరముత్తు వేధించారని ‘మీటూ’ ఉద్యమం సమయంలో చిన్మయి చెప్పారు. ఓ కార్యక్రమం కోసం విదేశానికి వెళితే అక్కడ.. ఓ వ్యక్తితో తన గదికి రమ్మని ఆయన చెప్పి పంపారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్ని వైరముత్తు ఖండించారు. మరోపక్క ఆయన తమతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని పలువురు మహిళలు బయటపెట్టారు. కాగా ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నేత ఖుష్బూ గురువారం ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న తనతో గుంపులో ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.

దీన్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ చిన్మయికి ట్వీట్‌ చేశారు. ‘ఈ మాటలు కేవలం చిన్మయి కోసం మాత్రమే.. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు’ అని పేర్కొన్నారు. దీన్ని చూసిన చిన్మయి ప్రతిస్పందించారు. ‘కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా. చూస్తుంటే.. నాకు కేవలం ఈ విధంగా మాత్రమే న్యాయం జరిగేలా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. వైరముత్తుపై ఆరోపణలు చేసిన తర్వాత ఆయన అభిమానులు చిన్మయిని తీవ్రంగా విమర్శించారు. పదేళ్ల క్రితమే ఎందుకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు.

ఈ మద్య ఓ మీటింగ్ కి హాజరవుతున్న ఖుష్బు పట్ల ఓ యువకుడు తాకరాని చోట తాకడంతో వెంటనే వాడి చెంప చెల్లుమనిపించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. “కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలపై వైరముత్తు అభిమానుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.