సెగలుపుట్టిస్తున్న పూజ హెగ్డే.. అంత కనిపించేలా..!!

పూజా హెగ్డే తెలుగులో అందరి టాప్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ ల రేంజ్ కి వెళ్ళిపోయింది. అయితే ఈ అమ్మడు అందాల ప్రదర్శన మరో లెవెల్ కు చేరిందని చెప్పక తప్పదు. అసలే వ్యాయామశాలలో తరచుగా కఠినమైన కసరత్తులు చేస్తూ ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది.. అందుకే సెక్సీ డ్రెస్సులు వేస్తే మన నెటిజనులతో పాటు డోనాల్డు ట్రంపు.. కిమ్ ఉన్ జోంగులు కూడా పూజా అందానికి ఫ్లాట్ అవడం ఖాయం. ప్రస్తుతం మహేష్ సరసన మహర్షి చిత్రంలో నటించిన వచ్చే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ – రాధాకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ పూజానే హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్ లతో సెగలు పుట్టిస్తుంది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇందులో పూజ ఒక బికినీ డ్రెస్ వేసుకుంది. సింగిల్ పీస్ కాబట్టి దీన్ని మోనోకిని అంటారు. అయితేనేం వాడుక భాషలో అయితే మనకు బికినీనే. అసలు ఆ బికినీని డిజైన్ చేసిన వారెవరో కానీ కళాత్మకత టన్నుల్లో ఉంది. పూజ అందం గురించి మాట్లాడుకునేముందు ఆ డిజైనర్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసలు ఆ స్ట్రాపులు ఏంటి.. ఆ జాయింట్లు ఏంటి.. ఎలా వచ్చిందో ఇలాంటి ఐడియా!అసలే ఇంటర్నేషనల్ మోడల్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఫుల్ గా ఉండే పూజ.

ఈ కిరాక్ బికినీ వేసుకొని తలపై చేతులు పెట్టుకుని పచ్చని చెట్ల మధ్యలో నిలబడింది. ఖజురహో శిల్పంలా కనిపిస్తూ అందాలు అదరహో అనిపిస్తోంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజనులకు పిచ్చెక్కింది. సూపర్ హాట్ అని ఎక్స్ ట్రీంలీ హాట్ అని.. స్టన్నింగ్ అని.. మార్వెలస్ అని .. మైండ్ బ్లోయింగ్ అని ఇంగ్లీష్ లో ఉన్న విశేషణాలు అన్నీటినీ వాడుతూ పొగడ్తలు కురిపించారు.