రవితేజ కి విలన్ గా నటించబోతున్న పూరి హీరో..!!

ప్రస్తుతం సినీ నటుల ట్రెండ్ కథానుగుణంగా మారుతుంది. కుర్ర హీరోలందరూ కథ బావుంటే ఏ క్యారక్టర్ చేయడానికైనా ఒప్పుకుంటున్నారు..తప్పకుండా అందులో నటించాలి అనుకుంటున్నారు. ఉదాహరణకు నాని తన 25వ చిత్రం లో నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అలాగే మరో యువ కథానాయకుడు నవీన్ చంద్ర .. అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో నెగటివ్ షేడ్స్‌లో నటించాడు. అల్లరి నరేష్, ఆది పినిశెట్టి తదితరులు కూడా గ్రేషేడ్స్‌లో మెప్పించారు. ఆర్‌.ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా విలన్‌గా నటిస్తున్నాడు. ఇలా చాలా మంది కుర్ర హీరోలు కథానుగుణంగా పాత్రలు చేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు.

తాజగా ఈ లిస్టులో మరో కుర్ర హీరో జాయిన్ అవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. ఇషాన్‌. ఈ యువ కథానాయకుడు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన రోగ్‌ చిత్రంలో హీరో గా నటించాడు. ఆ సినిమా తర్వాత ఇషాన్ మరే సినిమాలో నటించలేదు. గ్యాప్ తర్వాత ఇషాన్ విలన్‌గా నటించబోతున్నాడని టాక్‌. వివరాల్లోకెళ్తే.. అజయ్ భూపతి త్వరలోనే రవితేజతో మహా సముద్రం అనే సినిమాను డైరెక్ట్ చేస్తాడని టాక్‌. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో ఇషాన్‌ను విలన్‌గా నటింప చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నిజమో, అబద్దమో తెలియాలంటే ఈ సినిమా యూనిట్ ఎలా స్పందించే వరకు వేచి చుడాలి మరి.