సాహో హీరోయిన్ పై మనసుపడ్డ రాజమౌళి..!!

తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సిద్దం అయ్యారు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు ఇండస్ట్రీలో టాప్ మీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 1920 నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా..పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కోమురం భీమ్ ల కథానేపథ్యంలో ఉండబోతుందని ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు రాజమౌళి. అయితే అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాయికగా డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ కొని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఆ స్థానంలో కొత్త హీరోయిన్‌ కోస దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్వేషిస్తున్నారు. ఈ కోవలో ఆయన పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వీరిలో శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, నిత్యా మీనన్ ఇలా అనేక మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వీరందరిలో శ్రద్ధా కపూర్‌పై రాజమౌళి మనసుపడినట్టు తెలుస్తోంది. గ్లామర్ పరంగా నటన పరంగా ఈ సుందరికి వంకబెట్టవలసిన అవసరం లేదు. అలాంటి శ్రద్ధా కపూర్.. ‘సాహో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలో చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ ఫిల్మ్ నగరులో వినిపిస్తోంది.

పాత్రపరంగా శ్రద్ధా కపూర్ అయితేనే సూట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఆమె ‘చిచ్చోరే’.. ‘స్ట్రీట్ డాన్సర్’ సినిమాలు కూడా సెట్స్‌పై వున్నాయి. అయినా డేట్స్ సర్దుబాటు చేయించి.. ఈ సినిమాకి తీసుకురావాలనే దిశగా రాజమౌళి సినిమా టీమ్ ప్రయత్నాలు చేస్తోందట. ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.