మళ్ళీ రాజకీయం చేస్తున్న రజనీ..!

తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా పరిచయం అవసరం లేని పేరు రజనీకాంత్. ఆలిండియా సూపర్ స్టార్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే రజనీకాంత్ కెరీర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉండగానే బాబా సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నా అని ప్రకటించి అప్పట్లో తప్పు చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే తప్పును కబాలి టైమ్ లో రిపీట్ చేశాడు. కేవలం తన రాజకీయ ప్రస్థానానికి పనికొచ్చేలా కాలా చిత్రాన్ని దగ్గరుండి మరీ రాయించుకొన్న రజనీకాంత్ కు ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయినా.. ఆయన పోలిటికల్ పాయింటాఫ్ వ్యూ ఏమిటనేది స్పష్టం చేసింది. అయితే.. అభిమానులు తనను కమర్షియల్ హీరోగా మిస్ అవుతున్నారని గ్రహించిన రజనీ ఇమ్మీడియట్ గా 2.0, పేట సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా మళ్ళీ ఘనంగా చాటుకొన్నాడు.

ఇప్పుడు మళ్ళీ తన రాజకీయ తెరంగేట్రం దగ్గరపడుతుండడంతో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాని రాజకీయ నేపధ్యంలో చిత్రీకరించమని కోరాడట. ఆ మేరకు ఒక పవర్ ఫుల్ మరియు సెటైరికల్ స్క్రిప్ట్ రాసుకున్న మురుగదాస్ ఆ చిత్రానికి కుర్చీ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. సన్ పిక్చర్స్ సంస్థ ఆ టైటిల్ ను రిజిష్టర్ కూడా చేయించింది. దాంతో రజనీ ఫాలోవర్స్ అందరూ ఖుషీగానే ఉన్నప్పటికీ.. ఆయన సినిమాలను ఆరాధించే ప్రేక్షకులు మాత్రం మళ్ళీ పోలిటికల్ సినిమా ఎందుకు అని బాధపడుతున్నారు. మరి ఈసారైనా రజనీ తన సినిమాతో పోలిటిజల్ టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.