వామ్మో……మన రకుల్ ప్రీత్ ఇలా అయిపోయింది ఏంటి ?

సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యమో.. లేదంటే బాలీవుడ్‌కి వెళ్ళాక ఇలా సైజు జీరోలా బాడీ మెయింటింగ్ చేస్తే బావుంటుందనో…. ఇక్కడ కాస్త బొద్దుగా ఉండే రకుల్ ప్రీత్ బాలీవుడ్‌కి వెళ్ళగానే సైజు జీరోలా బక్క పల్చని భామలా మారిపోయింది. సౌత్‌లో సినిమాలు చేసినప్పుడు రకుల్ ఫిట్ నెస్ కోసం గంటలు తరబడి వర్కౌట్స్ చేస్తూనే ఉండేది. అమితంగా తిన్నా.

దానికి సరిపడా వ్యాయామం చేసేది. ఇక బాలీవుడ్‌లోకెళ్ళాక ఆ వర్కౌట్స్ మరింత ముదిరిపోయి.. ఇలా బక్క పలచగా… మోహంలో గ్లో కోల్పోయింది. ఇక తాజాగా జరిగిన ఎన్‌జికె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రకుల్ ప్రీత్ డిజైన్ వెర్ డ్రెస్ తో అద్భుతంగా రెడీ అయ్యింది. కానీ ఆమె మొహంలో గ్లో లేదు. మరీ పల్చని అందాలతో అస్సలు ఆకర్షించలేకపోయింది.

మరీ సన్నగా రకుల్ ని అలా చూస్తే తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. సన్నగా ఉన్నా మొహంలో గ్లో, మిగతా శరీర భాగాలలో అందాన్ని రకుల్ ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా మెయింటింగ్ చేసింది. కానీ ఇప్పుడు సన్నగా అవ్వాలనే తాపత్రయంతో అందాన్ని కోల్పోయింది. మరి ఒకప్పుడు రకుల్.. ఇప్పుడు ఈ బక్క పల్చని రకుల్‌లో కనిపించడం లేదు.