డియర్ కామ్రేడ్ టీజర్ తో రష్మిక కి మరిన్ని ఛాన్స్ లు..!!

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే అని చెప్పొచ్చు.. ఆమెకు పెద్ద హిట్స్ ఏమీ లేకపోయినా టాప్ హీరోల సరసన నటించే హీరోయిన్ ఎవరంటే ఫస్ట్ పూజ హెగ్డే నే గుర్తుకువస్తుంది అందరికి.. మరోవైపు చిన్న చిన్నగా పైకి వస్తుంది రష్మిక.. టాలీవుడ్ కి చలో సినిమా తో పరిచయమై అనతి కాలంలో బిజీ హీరోయిన్ గా మారిన హీరోయిన్ రష్మిక కన్నడంలో కిరాక్ పార్టీ సినిమా తో గుర్తింపు తెచ్చ్చుకుంది.. తెలుగులో చేసిన మొదటి సినిమా తో నే సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ రేస్ లో తాను ఉన్నట్లు చెప్పకనే చెప్పింది..

రెండవ సినిమా గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.. చేసిన రెండు సినిమా లు సూపర్ హిట్.. ఇంకేముందు ఆమెకు వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు అంతా.. కానీ ఈ కన్నడ గుమ్మా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా తన కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఒప్పుకుంటుంది.. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమా లో నటిస్తున్న ఈ కన్నడ భామ ఇటీవలే రిలీజ్ అయినా ఆ సినిమా టీజర్ లో లిప్ కిస్ తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.. అందం అభినయం తో పాటు ఇలాంటి బోల్డ్ సీన్స్ కూడా చేయడం ఆమె కు ప్లస్ కావడం తో హీరోలు ఆమెతో నటించడం కోసం ఎగబడుతున్నారు..

నిజానికి విజయ్ దేవరకొండ గీత గోవిందం లోనే వీరిద్దరి మధ్య ఓ లిప్ కిస్ సీన్ ఉంది. కానీ ఆ సీన్ ని ఎడిటింగ్ లో లేపేశారు.. అయితే ఇందులో టీజర్ తోనే టీజర్ లోనే ఆ సీన్స్ చాల ఉన్నాయని చెప్పకనే చెప్పింది..వర్షంలో ఆమెను కిస్ చేస్తున్న సీన్ కి అందరు అట్రాక్ట్ కాగా యువతని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ టీజర్ ని డిజైన్ చేసినా ఈ లిప్ లాక్ రష్మిక కు ఇప్పుడు మరింత అవకాశాలని తెచ్చిపెట్టేలా చేస్తుండడం గమనార్హం.. ఇంత బోల్డ్ గా ఉన్న పద్ధతి గల అమ్మాయి అయినా రష్మిక ని ఏ హీరో మాత్రం వదులుకుంటారు.. ఈమె జోరు చూస్తూనే ఇప్పుడు యువకథానాయికలు రకుల్ ప్రీత్ , రాశి ఖన్నా సర్దుకోవాలిపిస్తుంది.. ఇప్పటికే డేట్స్ ప్రాబ్లమ్స్ తో మహేష్ లాంటి స్టార్ సినిమా ని చేయలేకపోయింది.. మరి ఇప్పటికైనా ఆమె డేట్స్ విషయాన్నీ పట్టించుకుంటే మంచిది..