హీరోయిన్ రెజీనాకు రహస్యంగా నిశ్చితార్థం

సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రెజినా : సినిమాలు లేక వరుస ప్లాఫులతో ఇటు తెలుగులోను, అటు తమిళంలోను తన కెరీర్ ని ఎలా ముందుకు తీసుకెళాలో తెలియక అయోమయంలో పడింది మన టాలీవుడ్ ముద్దు గుమ్మా రెజినా కసాండ్రా. ఒకానొక టైంలో వరస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన అవేమి రెజినా కెరీర్కి పరంగా ఏమాత్రం ప్లస్ అవలేదు. మొన్న జరిగిన హీరోయిన్స్ ఫారిన్ సెక్స్ రాకెట్ మర్చిపోక ముందే నెటిజెన్లలు రెజినాకి ఇంకో పెద్ద షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి దాక సందీప్ కిషన్ తో ప్రేమాయణం, తరువాత నారా రోహిత్ తో డేటింగ్ , లేటేస్ట్గా సాయి ధరమ్ తేజ్ తో లివింగ్ రిలేషన్  ఇలా ఎన్నో  గోస్సిప్స్ గట్టిగానే వినిపించాయి. అసలు విషయానికి వస్తే ఈ నెల 13న హీరోయిన్ రెజీనాకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని,త్వరలోనే పెళ్లి కూడా జరగబోతోందని ప్రాంతీయ వెబ్‌సైట్లు మొదలుకుని జాతీయ వెబ్‌సైట్లు పెద్ద ఎత్తున వార్తలు రాసిన విషయం విదితమే. ఫొటోలతో సహా.. నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నిజమేనని అందరూ అనుకున్నారు. మరోవైపు ఈ పుకార్లపై రెజీనా కానీ.. ఆమె కుటుంబ సభ్యులు కానీ రియాక్ట్ అవ్వకపోవడంతో నిశ్చితార్థం నిజంగానే జరిగిందని అభిమానులు, సినీ ప్రియులు భావించారు.

అయితే.. ఈ నిశ్చితార్థంకు సంబంధించిన వార్తలు రోజురోజుకు పెరుగుతుండటం.. ఎవరికి తోచినట్లుగా వారు రాసేస్తుండటంతో ఎట్టకేలకు రెజీనా మీడియా ముందుకొచ్చేసి క్లారిటీ ఇచ్చుకుంది. గత వారం రోజులుగా తనపెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని.. వాటిని ఎవరూ నమ్మొద్దని తేల్చిచెప్పింది. అంతేకాదు అసలు.. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో.. ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావట్లేదని రెజీనా ఒకింత ఆవేదనకు లోనయింది.తనకు పెళ్లి కుదిరినా.. నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి డేట్ ఫిక్స్ అయినా ఖచ్చితంగా మీడియా ముందుకొచ్చి వెల్లడిస్తానని స్పష్టం చేసింది. అప్పటి వరకూ దయచేసి ఇలాంటి పుకార్లు ఎవరూ రాయొద్దు.. వాటిని అభిమానులు, సినీ ప్రియులు ఎవరూ నమ్మొద్దని రెజీనా స్పష్టం చేసింది. కాగా.. ఇటీవల విడుదలైన 7 మూవీలో రెజీనా తళుక్కుమన్న విషయం విదితమే.