భర్తకు విడాకులిచ్చి బీచుల్లో అందాల రచ్చచేస్తుందిగా..!!

ఉత్తరాది టెలివిజన్ ప్రేక్షకులకు తారలు రిధి డొగ్రా, రాకేష్ బాపట్ సుపరిచితులు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకొన్న వీరిద్దరి తాము విడిపోయినట్టు ఫిబ్రవరిలో వెల్లడించి షాకిచ్చారు. తాము విడిపోయినట్టు వస్తున్న వార్తలు నిజమే అని వారిద్దరూ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. భర్త నుంచి అధికారికంగా డైవోర్స్ తీసుకొంటున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీలంక బీచుల్లో మునిగి తేలడం కనిపించింది. బికినీలో ఆమె అందాల ఆరబోత ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

గతంలో రిధి డోగ్రా, రాకేష్ విడుదల చేసిన ప్రకటనలో.. అవును మేము విడిపోయాం. వేర్వేరుగా జీవిస్తున్నాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాం. దంపతులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఉండాలనుకొంటున్నాం. ఎప్పటి లాగానే మా మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగుతుంది అని అన్నారు.

రిధి డోగ్రా, రాకేష్ మధ్య దాంపత్య పరంగా విభేదాలు ఉన్న వారి మధ్య స్నేహ సంబంధాలు బాగానే ఉన్నాయి. వారిద్దరూ కలిసి తిరగడం, పార్టీలు చేసుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపించాయి. తమ సంబంధాలపై రాకేష్ మాట్లాడుతూ.. మా మధ్య ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. కానీ దాని అర్ధం మాత్రమే మారింది అని అన్నారు.మా మధ్య పెరిగిన దూరం మమల్ని వ్యక్తిగతంగా చేరువ చేస్తున్నది. మా రిలేషన్‌లో ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని గ్రహిస్తున్నాం. ఏదిఏమైనా మా మధ్య శతృత్వం, కోపతాపాలు లేవు. ఏడు ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నాం అని రాకేష్ అన్నారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య రిధి డోగ్రా మీ టైమ్ అంటూ శ్రీలంకలో విహార యాత్ర చేస్తున్నారు. బీచుల్లో ఆమె హాట్ ఫోటోలు వేడిపుట్టిస్తున్నాయి. జీవితంలో ఏది జరిగినా ఎంజాయ్ మాత్రం వదులుకోవద్దు. ఎంత భుజించినప్పటికీ ఆకలిని అలానే ఉంచుకోవాలి అంటూ భావోద్వేగంగా ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు.