RRR కి ఎందుకింత ఖర్చు..ఏముందని..!!

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇందులో తారక్, చరణ్ లు కథానాయకులుగా నటిస్తుండగా హీరోయిన్స్ గా అలియా భట్, ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారు.. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా జూ.ఎన్టీఆర్ నటిస్తుండడం విశేషం..నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్నీ అయన వెల్లడించగా చిత్ర కథా గమ్యం కూడా వెల్లడించి అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు.. సినిమా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. DVV దానయ్య సినిమా ని నిర్మిస్తున్నారు..ఇక ఈ సినిమా లో ఒక ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ కనిపిస్తున్నారు.. . 2020 జులై లో సినిమా ని ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. షూటింగ్ షెరవేగంగా జరుగుతుండగా మ్యూజిక్ సిట్టింగ్స్ మరోవైపు జోరుగా సాగుతున్నాయి.. ఇటీవలే కీరవాణి ఈ సినిమా కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి అని అయన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించగా ఈ సినిమా కి సరికొత్తగా సంగీతాన్ని సమకూర్చాలని ఆలోచనలో కీరవాణి ఉన్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే ఈ సినిమా కి అంత ఖర్చు ఎందుకని కొంతమంది సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.. ఏం చూపించబోతున్నారని 400 ఖర్చు పెట్టబోతున్నారని ప్రశ్నిస్తున్నారు.. ఆంగ్లేయులపై పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు, నైజం లో పోరాటం చేసిన కొమరం భీం ల కథగా జక్కన్న చెప్పగా, ఇద్దరు వీరులు అడవులనుంచే పోరాటం చేశారు.. దీనికి పెద్దగా ఖర్చు ఉండదు. బాహుబలి స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎలా వీరు వీరులుగా మారారు అనేదే ఈ సినిమా కధ కాగా ఎలాగో ఫిక్షన్ సినిమా అంటున్నాడు కాబట్టి ఇంత ఖర్చు ఎందుకా అని అభిమానుల ప్రశ్న.. దీనిపై రాజమౌళి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి..