ఆకట్టుకుంటున్న చిత్రలహరి టీజర్..!!

వరుసపరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి.. నేను శైలజ లాంటి చిత్రం తో భారీ విజయం సాధించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.. కాగా ఈ చిత్రానికి సంబంధిచి టీజర్ నేడు చిత్ర బృందం రిలీజ్ చేసింది.. ఈ టీజర్ లో నాలుగు పాత్రలను పరిచయం చేయగా, వాటిలో మొదటి రెండు పాత్రలు హీరోయిన్స్ వి. మరొకటి కమెడియన్ సునీల్, చివరిది హీరో సాయి ధరమ్ తేజ్ ది.. ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ విజయ్ అనే పాత్రలో కనిపించనుండగా, పేరు లో విజయ్ ఉంది కానీ జీవితంలో విజయం లేదని బాధపడుతుంటారు.. బాధపడకురా నీకు మంచి రోజులొస్తాయి అని కమెడియన్ అనగా ఆ వచ్చేదేదో ఆదివారం రమ్మంటారా… నేను ఖాళీగా ఉంటాను అనే చెప్పే డైలాగ్ టీజర్ కె హైలైట్ .. కళ్యాణి ప్రియదర్శిని, నివేద పెత్తురాజ్ హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.. గతంలో కిషోర్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలు ముసిచల్ హిట్స్ గా నిలిచాయి.. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరుతుందా చూద్దాం..