మజిలీ సినిమా ఎందుకు చూడాలంటే..సమంత పెద్ద కారణమే చెప్పింది..!!

టాలీవుడ్ రొమాంటిక్ రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మజిలీ’. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు సాంగ్స్‌ని విడుదల చేయగా.. గురువారం నాడు మూడో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా సమంత ఈ సినిమా ఎందుకు చూడాలో అని ఓ నెటిజన్ అడగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.. ఇటీవల అక్కినేని నాగచైతన్య ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశాడు. నన్ను కానీ సమంతను కానీ అడ్రస్ చేస్తూ మీరేదైనా ప్రశ్న అడగవచ్చు. మా సినిమాలకు సంబంధించి కానీ.. లేదంటే సరదాగా ఏదైనా సరే ప్రశ్న అడగండి మేము ఆన్సర్ చేస్తామని ట్వీట్ చేశాడు. దానిని చూసిన అభిమానులు తమ ప్రశ్నలను ఆ యంగ్ కపుల్ ముందుంచుతున్నారు. ఒక నెటిజన్.. ‘మజిలీ’ సినిమాను మేము ఫ్యామిలీతో సహా చూసేందుకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఏదైనా ఉంటే చెప్పు? నేను నీకోసమైనా వెళతాననుకో..’ అంటూ సమంతను ప్రశ్నించాడు. దీనికి సామ్.. ‘ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంటుంది. అంతే కాకుండా నేను బెట్ కట్టి మరీ చెప్పగలను ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని ఏదో ఒక సీన్‌తో కనెక్ట్ అయి ఉంటారు’ అని సమాధానమిచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే చైతు – సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా భార్యభర్తల్లా సామ్ – చై చాలా సహజంగా నటించారని తెలుస్తోంది.ఇంకా చెప్పాలంటే జీవించారని చెప్పాలట.ఇక ఈ సినిమాలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించనున్నాడు.ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్యలతో పాటు దివ్యాంశ కౌశిక్‌ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.