సమంత మళ్ళీ బిజీ కానుందా…మూడు సినిమాలతో…!!

అక్కినేని ఇంటి కొడలు వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి తరువాత సమంత నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో ఈ బామకు మరింత డిమాండ్ పెరిగింది. ‘రంగస్థలం, మహానటి, యుటర్న్’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సమంత.. ఇప్పుడు తన భర్తతో కలిసి ‘మజిలీ’లో నటించారు. పెళ్లి తరువాత భర్త నాగచైతన్యతో కలిసి మొదటిసారి ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో చైతన్య భార్యగానే నటించింది సమంత. వ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో బేబీ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ .. ఈ నెల 29వ తేదీన అక్కడ విడుదల చేస్తున్నారు. ఇదే రోజున తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. సమంత ప్రధాన పాత్రధారిగా చేసిన ‘ఓ బేబీ’ కూడా ఈ వేసవిలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను మాత్రం తమిళంలో కాకుండా తెలుగులో మాత్రమే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి హీరో నాగ శౌర్య కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ కొరియన్ మూవీ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సమంతా లక్ష్మిల పాత్రలు షాక్ ఇచ్చే రీతిలో ఉంటాయట. నందిని రెడ్డితో గతంలో జబర్దస్త్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో మూవీ అయిన వీరికి హిట్‌ను అందిస్తుందేమో చూడాలి. ఈ మూడు సినిమాలు కూడా కథాకథనాల పరంగా విభిన్నమైనవి.