సునీల్ చనిపోయాడంటూ కథనాలు.. స్పందించిన సునీల్.. వారికి శిక్ష విధించాలి..!!

ఇన్నాళ్లు వయసు మీదపడి, సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నటీ నటులు చనిపోయారంటూ వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తప్పుడు వార్తల వలన ఆయా నటీ నటులు బయటికొచ్చి మేము బాగానే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి వార్తలపై పలువురు పోలీసులకు పిర్యాదులు కూడా చేశారు. అయినా అవి ఆగడంలేదు. తాజాగా ప్రముఖ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రేక్షకులకు, అభిమానులకు తెలిపారు. ‘అది తప్పుడు వార్త. నేను క్షేమంగా ఉన్నా. దయచేసి ఆ వార్తను నమ్మొద్దు’ అని నటుడు సునీల్‌ ట్వీట్‌ చేశాడు. సునీల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఓ వెబ్‌సైట్‌ తప్పుడు వార్తను రాసింది. దీన్ని చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు సునీల్‌ ట్విటర్‌లో స్పందించాడు. వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు రాసే వార్ని శిక్షించాలని అభిమానులు కామెంట్లు చేశారు. ఇలాంటి ఘోరమైన వదంతులు రాయడం సరికాదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. సదరు వెబ్‌సైట్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అభిమానులు సునీల్‌ను కోరారు.