నాగబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా – శివాజీ రాజా..!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించింది.నరేష్ కు చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున లాంటి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాగబాబు సైతమ్ నరేష్ వైపు నిలిచి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు.

కాని నరేశ్‌ను ప్రమాణస్వీకారాన్ని అడ్డుకున్నారని ఆయన మీడియాతో ఎదుట వచ్చి చెప్పి చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది. పోజిషన్ పార్టీ గెలిస్తే, ఇంకా కాలపరిమితి వున్నా కూడా సాధారణంగా ముందు కమిటీ పక్కకు తప్పుకుని కొత్త కమిటీకి అవకాశం ఇస్తుంది.కానీ ఇప్పుడు మా అసోసియేషన్ కు అలా జరగడం లేదు. దినిపై నరేష్ ప్రెస్ మీట్ పెట్టి శివాజీ రాజాపై ఆరోపణలు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు శివాజీ రాజా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేష్ ప్రమాణస్వీకారాన్ని మేం అడ్డుకోలేదని , రూల్స్ ప్రకారం ఈ నెలాఖరు వరకు టైం ఉందని మాత్రమే చెప్పానన్నారు.

ఈ ఎన్నికల్లో నాగబాబుగారు నరేశ్‌కు మద్దతు తెలిపారని, అయితే ఇప్పుడు తాను నాగబాబుకి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పుకొచ్చారు శివాజీ రాజా. ఓల్దేజ్ హోం కట్టడం తన కల అని , దానిపై నీళ్లు చల్లరని మీడియా ఎదుట వాపోయారు శివాజీ రాజా. ఓల్దేజ్ హోం కడితే కాశీ నుండి నీళ్లు తెప్పించి కాళ్లు కడుగుతానని సవాల్ విసిరారు.