నా బాడీ ఎలా ఉంటె మీకుందుకు..నేనలాగే చూపిస్త – సోనమ్..!!

బాడీ షేమింగ్ విషయంలో సెలెబ్రిటీలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పించ్ కార్యక్రమంలో సోనమ్ కపూర్ అతిథిగా పాల్గొంది. ఈ షోకు అతిథులుగా బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు. ఇటీవల సన్నీ లియోన్ కూడా పించ్ కార్యక్రమంలో పాల్గొని, తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది. సోనమ్ కపూర్ తనపై వస్తున్న విమర్శలని ఎలా అధికమించానో వివరించింది.

సోనమ్ కపూర్ పించ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో తాను కూడా బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నట్లు సోనమ్ కపూర్ తెలిపింది. 2007లో సావరియా చిత్రంతో అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ లోకి సోనమ్ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. నీర్జా చిత్రంలో నటనకి గాను సోనమ్ కపూర్ ప్రశంసలు దక్కించుకుంది. గత ఏడాది సోనమ్ తన ప్రియుడు ఆనంద్ అహుజాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

తన కెరీర్ ఆరంభంలో చాలా మంది బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారు. సన్నగా ఉన్నావు.. నల్లగా ఉన్నావు.. ఇలాగైతే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అని విమర్శలు చేసేవాళ్ళు. వారి విమర్శలకు కోపగించుకునేదాన్ని కాదు. వారందరిని నా శ్రేయోభిలాషులుగానే భావించా. కెరీర్ పై దృష్టి పెట్టి ఈ స్థాయికి చేరుకున్నా. ఆ విమర్శల తర్వాతే ఫిట్నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నానని సోనమ్ కపూర్ తెలిపింది.

ఇప్పుడు బాలీవుడ్ లో నటిగా నాకంటూ ఓ గుర్తింపు ఉంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. నాపై విమర్శలు చేసినవారికి ఇంతకంటే నేను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు అని సోనమ్ తెలిపింది. వివాహం తర్వాత కూడా సోనమ్ కపూర్ సినిమాల్లో కొనసాగుతోంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో సోనమ్ చాలాకాలం పాటు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో ఈ జంట గత ఏడాది వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం సోనమ్ కపూర్ జోయా ఫ్యాక్టర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2011 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకుడు. జూన్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోనమ్ కపూర్ మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.