నిహారిక పై శ్రీరెడ్డి సెటైర్.. త్వరగా పెళ్లి చేయండి లేకపోతే..!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల మాట ఏమో గానీ మెగా ఫ్యామిలీ తో శ్రీరెడ్డి మధ్య చెలరేగిన వివాదం రోజు రోజు కి ఉగ్రరూపం దాల్చుతుంది.. మొన్నటికి మొన్న శ్రీరెడ్డి పవన్ , పూనమ్ ల మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టి జనసేన పరువును సగం రోడ్డుకి ఈడ్చుతుంటే నేడు నాగబాబు పై అయన కూతురు నిహారిక పై ఓ సెటైర్ వేసి మరోసారి వారి మీద ఉన్న కోపాన్ని రెచ్చిపోయి ప్రదర్శిస్తుంది.. నాగబాబు యూట్యూబ్ లో టీడీపీ కి వ్యతిరేకంగా వీడియోస్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవలే నాగబాబు ఇకనైనా చంద్రబాబు కు రాజకీయాలనుంచి రిటైర్మెంట్ కల్పిస్తామని సెటైరిటికల్ గా ఓ వీడియో చేశారు.. ఆ వీడియో కి కౌంటర్ గా శ్రీరెడ్డి ఓ వీడియో చేసి రిలీజ్ చేసింది.. నాగబాబు ఓ వీడియో పోస్ట్ చేశాడు.. చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవాలని ఏవేవో మాట్లాడాడు. మీకు కౌంటర్ ఇవ్వడానికి నేను ఉన్నాను గా అంటూ చంద్రబాబు గారు తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే ఉండాలి. ఇక్కడ మెగా ఫామిలీ మొత్తం తన తమ్ముడిని సీఎం చేయాలనీ అనుకుంటున్నారు.. సరే.. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలనుంచి తప్పుకుంటే అంత అనుభవం ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారు.. మీ తమ్ముడా.. మీ తమ్ముడు సీఎం అయ్యి ఏం పొడుస్తాడు.. ఆంధ్ర లో ఉన్న కన్నెపిల్లలందరిని పెళ్లిచేసుకుంటాడా.. లేక ఇష్ట రాజ్యంగా సోషల్ మిడియా లో ట్రోలింగ్ చేయించడానికా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.. చంద్రబాబు గారి వయసుతో మీకేంటి పని ముందు మీకు వయసుకొచ్చిన కూతురు ఉంది.. ముందే ఆమెకు పెళ్లి సంబంధాలు చుడండి.. అంటూ వెటకారంగా నాగబాబు పై సెటైర్లు వేసింది శ్రీరెడ్డి.. దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి..