ఉపాసన ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..!!

టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని పలు విమర్శలు చేస్తునే ఉంది శ్రీరెడ్డి. గతంలో పవన్ కల్యాణ్‌, వాళ్ల అమ్మాగారి గురించి పబ్లిక్‌గానే బూతులు తిట్టింది శ్రీరెడ్డి. ఎన్నికల సమయంలో కూడా పవన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా నిర్వహించింది శ్రీరెడ్డి. తాజాగా శ్రీరెడ్డి మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

చిరంజీవి కుటుంబంలో తనకు నచ్చిన వ్యక్తి ఒకరున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మెగా ఫ్యామిలిలో నేనొకరిని ఎంతో ప్రేమిస్తాను,మచ్చలేని మనిషి, స్ఫూర్తిప్రదాత, ఎవరో చెప్పగలరా..? అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మెగా ఫ్యామిలిలో నాకు నచ్చిన వ్యక్తి ఎవరో మీరే చెప్పండని ఓ పోల్ పెట్టింది. దీంతో అందరు మెగా హీరోల పేర్లు చెప్పసాగారు. వారెవరూ కాదని మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాసన పేరు చెప్పింది. ఉపాసనను తనకు ఎంతో దగ్గరైన వ్యక్తిగా భావిస్తానని, గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ఇప్పుడు శ్రీరెడ్డి ఉపాసన పేరు ఎందుకు తెర మీదకు తెచ్చిందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.