ఇప్పుడు శ్రీరెడ్డి గురి మహేష్ పైనే.. షాక్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ..!!

సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరిని కడిగేస్తుంది శ్రీరెడ్డి.. నిన్నటిదాకా పవన్ ని తన మాటలతో విమర్శించి ఆ తర్వాత త్రివిక్రమ్, నాగబాబులను ఓ అట ఆడేసుకుంది.. దాంతో ఆమె జోలికి వెళ్లాలంటేనే ఒక్కొక్కరికి భయమేస్తుంది.. రోజుకో సంచలన విషయం చెప్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. స్టార్స్ వెనకాల ఉండే చీకటి కోణాన్ని బయటకి చెప్తూ వారి లోని మరోకోణాన్ని జనాలకి పరిచయం చేస్తుంది.. తమిళ సినిమాల్లో అవకాశాలపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎపి లో ఎన్నికల నేపథ్యంలో తన ద్రుష్టి పూర్తిగా పాలిటిక్స్ పై పెట్టి జనసేన ను అటు మింగలేకుండా, కక్కలేకుండా చేస్తుంది.. తాజగా సూపర్ మహేష్ మహేష్ బాబు ని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి.. సినిమాల్లో స్ఫూర్తిదాయకమైన సబ్జెక్టు లు ఎంచుకుంటారు.. మహేష్ బాబు రావాల్సిన అవసరం ఉంది. అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో మహేష్ బాబు ఫోటో షేర్ చేసి ” అయన సినిమాల్లో స్ఫూర్తిదాయకమైన సబ్జెక్టు లు ఎంచుకుంటారు.. ఎంతమంది ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారు.. ఆయనకు సూటయ్యే పార్టీ ఏదీ. నేను అయన ఎంచుకునే సబ్జెక్టు లకు , సింప్లిసిటీ కి అభిమానిని ” అంటూ మహేష్ బాబు ను ఉద్దేశించి మాట్లాడారు.. అయితే శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ పెట్టిన వెంటనే మహేష్ అభిమానులు రియాక్ట్ అయ్యారు.. కొందరు ఆయనకు వైసిపి సూట్ అవుతుందని , మరికొందరు టీడీపీ సూట్ అవుతుందని, మరికొందరేమో ఆయన్ని రాజకీయాల్లోకి లాగొద్దని వేడుకుంటున్నారు.. గతంలో మహేష్ బాబు ను మీడియా రాజకీయాలగురించి అడగగా, తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అని తనకు వాటి గురించి తెలియదని, ఎప్పటికి రాజకీయాల్లోకి రాను అని తనకు తెలిసిన సినిమా రంగంలోనే కొనసాగుతాను అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే తన పని తాను చేసుకుపోయే శ్రీరెడ్డి సడెన్ గా మహేష్ మీదకి గాలి మళ్లడం ఏవేవో అనుమానాలకు దారితీస్తున్నాయి.. ఇక మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నారు.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు..