అవును నేను స్వలింగ సంబంధం కలిగి ఉన్నాను.. ఆ అమ్మాయితో రోజు.. స్టార్ క్రీడాకారిణి వ్యాఖ్యలు..!!

ఈ మధ్య కాలంలో స్వలింగ సంపర్క సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి.. ఇటీవలే సుప్రిం కోర్ట్ కూడా దీన్ని తప్పు పట్టకపోవడం తో ఆ ఆలోచనలు ఉన్నవారికి లైసెన్సు ఇచ్చినట్లయింది..తాజాగా మన భారత అథ్లెట్ ద్యుతీ చాంద్ కూడా తాను మరో యువతితో స్వలింగ సంబంధాన్ని కలిగి ఉన్నట్టు సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఓ భారతీయ క్రీడాకారిణి తాను స్వలింగ సంబంధంలో ఉన్నానని స్టేట్‌మెంట్ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో.. ఒడిశాలోని తన స్వగ్రామమైన గోపాల్‌పూర్‌కి చెందిన ఓ అమ్మాయితో స్వలింగ సంబంధంలో ఉన్నట్టు చెప్పారు. ఎవరు ఎవరితో కలిసి జీవించాలనుకుంటున్నా రన్నది వారి వ్యక్తిగత విషయని ఆ విషయంలో వారికి పూర్తి స్వేచ్చ ఉండాలని ద్యుతీ అన్నారు.

స్వలింగ సంపర్కుల హక్కులకై తానెప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉన్నానని గుర్తుచేశారు. ఎల్‌జీ‌బీటీ వివాహాలకు భారత్‌లో ఇంకా చట్టబద్దత లేదన్న ద్యుతీ.. అదే సమయంలో వాటిపై నిషేధం కూడా లేదని అన్నారు. వ్యక్తిగత జీవితంలో తాను స్వలింగ సంబంధాన్ని కలిగి ఉన్నంత మాత్రానా.. దాని ఆధారంగా తన అథ్లెటిక్ కెరీర్ గురించి మాట్లాడరాదన్నారు. 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగే వర్లడ్ ఛాంపియన్‌షిప్ పైనే ప్రస్తుతం ద్యుతీ తన దృష్టి సారించింది. ఆసియా గేమ్స్-2018లో ద్యుతీ సిల్వర్ మెడల్ సాధించింది. భారత్ తరుపున గత 20 ఏళ్లలో ఆ పథకాన్ని సాధించినది ద్యుతీ మాత్రమే కావడం విశేషం. ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన ద్యుతీ.. ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయి చేరుకుంది.