రాహుల్ గాంధీ తో డేట్ కి వెళ్లాలని ఉందని చెప్పిన స్టార్ హీరోయిన్..!!

రాజకీయాల్లో ఎక్కువగా యాక్టివ్ గావుండే రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ.. అయన పెళ్లి చేసుకోలేదన్న సంగతి అందరికి తెలిసిందే.. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం లో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే రాహుల్ గాంధీ తో డేట్ కి వెళ్లాలని ఉంది అని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ అంది.. ఇప్పుడీ స్టేట్మెంట్స్ మొత్తం దేశమంతా వైరల్ అవుతున్నాయి.. సిమి గరేవాల్ తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కరీనా తన లైఫ్ లోని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది..

అయితే ఈ షో లో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు ఇలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.. మీరు ఎవరితో డేట్ కి వెళ్లాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు కరీనా రాహుల్ గాంధీ అని నిస్సందేహంగా సమాధానమిచ్చింది.. అంతేకాదు మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలో వద్దో తెలీదు కానీ చెప్పేస్తాను అని ఇలా కాంట్రవర్సియల్ ఆన్సర్స్ చెప్పింది..

ఇంకా రాహుల్ గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందని, మేగజైన్స్ లో అతని ఫోటోలు చూసినప్పుడు అతనితో మాట్లాడితే ఎలా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుందని ఆమె తన కోరిక ను వెళ్లబుచ్చింది.. తాను పూర్తిగా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను, అయన పూర్తిగా రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన్ని కలిసే అవకాశం మాట్లాడే అవకాశం రాలేదని పేర్కొంది.. సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చూసుకున్న కరీనా కపూర్ కోరికను రాహుల్ గాంధీ తీరుస్తాడా చూడాలి..