పెళ్లి ప్లాన్ పక్కన పెట్టిన తమన్నా

30 ఏళ్ళు దాటిన హీరోయిన్స్ ను రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ మీ పెళ్ళెప్పుడు అని. కొందరు హీరోయిన్స్ సున్నితంగా త్వరలోనే మీకు చెప్తాను అంటే.. ఇంకొందరేమో మీకెందుకు అని రూడ్ గా సమాధానమిస్తుంటారు. అంత పాపులర్ అయిన ఈ పెళ్లి అనే క్వశ్చన్ కు తమన్నా మాత్రం ఇప్పుడప్పుడే సమాధానం చెప్పను అంటోంది. నిజానికి గతేడాది తమన్నాకు కెరీర్ పరంగా కానీ, పర్సనల్ లైఫ్ పరంగా కానీ పెద్ద ఆశాజనకంగా లేదు. దాంతో సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామనుకుంది. ఈమేరకు ఇంటర్నల్ టాక్స్ నడవడంతోపాటు.. పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు తాను నటించిన ఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, త్వరలోనే చిరంజీవితో కలిసి నటించిన సైరా విడుదలకు రెడీ అవుతుండడం, తమిళంలో మళ్ళీ అమ్మడికి ఆఫర్లు వస్తుండడంతో తమన్నా 2019లో అనుకున్న తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసిందని 2020 లేదా ఆ తర్వాత చేసుకోవాలని నిర్ణయించుకొందని చెప్పుకొచ్చింది. ఈ తరహా వ్యవహారం కాజల్ విషయంలోనూ జరిగిన విషయం తెలిసిందే. ఇలా స్టార్ హీరోయిన్లందరూ కెరీర్ పెద్దగా బాగోలేదని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవ్వడం ఆ తర్వాత హిట్స్ పడడంతో పెళ్లి పోస్ట్ పోన్ చేయడం కారణంగా వాళ్ళు, వాళ్ళ అభిమానులు సంతోషంగానే ఉన్నారు కానీ.. ఆ పెళ్లికొడుకులే పాపం వెయిట్ చేయలేక, వదులుకోలేక నానా ఇబ్బందులుపడుతున్నారు.