మాస్ హీరో తో వెంకీ మల్టీస్టారర్..!!

సీనియర్ హీరో వెంకటేష్ కు మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. మహేష్ బాబుతో కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన ‘ఎఫ్ 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో అలంటి సినిమాపై వెంకీ ఆసక్తి చూపుతున్నారు. మల్టీస్టారర్‌ చిత్రంగా సంక్రాంతికి విడుదలైన ‘f2’తో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఇప్పుడు ఆయన మరో మల్టీస్టారర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. తాజాగా ‘బిందాస్’, ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాలను తెరకెక్కించిన వీరు పొట్లా వెంకీ కోసం ఒక మల్టీస్టారర్ కథను రెడీ చేశారట. అందులో వెంకీతో కలిసి రవితేజ నటిస్తాడని తెలుస్తోంది. ఇంకా స్క్రిప్ట్‌పై చర్చలు జరుగుతున్నాయట. మరి కొన్ని వారాల్లో సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాకు అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క వెంకటేశ్‌ ‘వెంకీ మామా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన మేనల్లుడు, సినీ నటుడు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. బాబీ ఈ సినిమాకి దర్శకుడు.ఇందులో రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్స్. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వీలైనంత తొందరగా కంప్లీట్‌ చేసి ఈ ఏడాదే ‘వెంకీమామ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట టీమ్‌..