తన బాడీ షేప్ గురించి విద్యాబాలన్ ఏముందో చుడండి..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పడంలో ఎప్పుడు మొహామాట పడలేదు విద్యాబాలన్‌. డర్టీ పిక్చర్ సినిమాతో లైఫ్ లైన్లో వచ్చిన విద్యాబాలన్ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. విద్యా బాలన్ తెలుగులో కూడా నటించింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించి మెప్పించింది విద్యా బాలన్. ఆ మధ్య శృంగారం గురించి బొల్డ్ కామెంట్స్ చేసింది. మహిళలకు 40 ఏళ్ల వయస్సులోనే ఎక్కువుగా శృంగారంపై ఆసక్తి ఉంటుందని చెప్పి సంచలనం రేపింది. తాజా విద్యా బాలన్ తన బాడీ సేప్ గురించి హాట్ కామెంట్స్ చేసింది.

కెరీర్ స్టార్టింగ్‌లో సన్నగానే ఉన్న విద్యా బాలన్ తరువాత కాస్తా లావుగానే మారింది. అయితే దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది. తనకు థైరాయిడ్ సమస్య ఉందని, డైటింగ్ చేసినా.. సమస్య పరిష్కారం కావడం లేదని విద్యాబాలన్ చెప్పేది. థైరాయిడ్ సమస్య వేధిస్తున్న సమయంలో తనపై తనకే అసహ్యం వేసేదని విద్యాబాలన్ అన్నారు. విద్యాబాలన్ తన శరీర బరువు విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది. ఇటువంటి విమర్శలను పక్కనపెట్టి తన సంతృప్తి కోసం శరీర బరువును తగ్గించుకునే ప్రయత్నం ప్రారంభించానని చెప్పుకొచ్చింది.